Tillu Square: ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చిన టిల్లు 2 మూవీ మేకర్స్!

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ అప్‌డేట్ ఇచ్చారు.

Tillu Square: ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చిన టిల్లు 2 మూవీ మేకర్స్!
X

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'టిల్లు 2' . 2022లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న డిజే టిల్లు సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా వ‌స్తుంది. ఇక ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మల్లిక్‌రామ్ ‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన గ్లింప్స్‌, ఫ‌స్ట్ సింగిల్ టికెటే కొనకుండా పాటకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను ప్రేమికులరోజు సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.

ఇక ట్రైలర్ అప్‌డేట్ తో పాటు న్యూ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్‌లో సిద్దు జొన్నలగడ్డ అనుపమ బెడ్ పై అలా చుస్తూ ఉంటారు. ఇక ఈ పోస్టర్‌లో సిద్దు, అనుపమ కెమిస్ట్రీ బాగుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డిజే టిల్లుతో మంచి హిట్ కొట్టిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాతో ఎలావటి విజయని అందుకుంటడో చూడాలి.

Tags:
Next Story
Share it