Srinivas yadav: తలసాని ఇంట తీవ్ర విషాదం

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చేరారు.

Srinivas yadav: తలసాని ఇంట తీవ్ర విషాదం
X

న్యూస్ లైన్ డెస్క్: BRS నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్(Thalasani Shankar Yadav) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

గతంలో శంకర్ యాదవ్ మోండా మార్కెట్(Monda Market) వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా, బోయిన్ పల్లి మార్కెట్(Boyin Pally Market) అధ్యక్షుడిగా సేవ చేశారు. ఇక, ఆయన మరణంతో తలసాని కుటుంబంతో పాటు BRS వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు.

Tags:
Next Story
Share it