TS: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల!

తెలంగాణ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి

TS: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల!
X

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. రెండేళ్ల బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి సోమవారం విడుదల చేశారు. నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న జరిగిన టీఎస్ ఎడ్‌సెట్ 2024 పరీక్ష ప్రిలిమినరీ 'కీ'ని ఇటీవల విడుదల చేయగా తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నాగర్‌కర్నూలుకు చెందిన నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన అషిత రెండు, మూడో శ్రీతేజ ర్యాంకులు సాధించారు. మొత్తంగా టీఎస్ ఎడ్‌సెట్‌కు 29,463మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 28,549మంది (96.90%) ఉత్తీర్ణులైనట్లు బోర్డు అధికారులు ప్రకటించారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లీక్ చేయండి: https://edcet.tsche.ac.in/

Tags:
Next Story
Share it