vijay: డైరెక్టర్ పరశురామ్ లేకుంటే 'ఫ్యామిలీ స్టార్' ఉండేది కాదు

ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురామ్, ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు అన్నారు.

vijay: డైరెక్టర్ పరశురామ్ లేకుంటే ఫ్యామిలీ స్టార్ ఉండేది కాదు
X

న్యూస్ లైన్ సినిమా: సినిమా అనేది డైరెక్టర్ విజన్ అని నమ్మే హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. అందుకే బుధవారం జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపించారు. విజయ్ పరశురామ్ లేకుంటే 'ఫ్యామిలీ స్టార్' సినిమా లేదని చెప్పారు. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ నా కెరీర్ లో ఒక మంచి సినిమా. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చాడు. ఈ సినిమాలో తన పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ అని పరశురామ్ అంటున్నారన్నారు. కానీ తను చేసిన పర్ ఫార్మెన్స్ కు మొత్తం క్రెడిట్ పరశురామ్ కే ఇవ్వాలని విజయ్ తెలిపారు. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురామ్, ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు అన్నారు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా పరశురామ్ కే దక్కుతుందన్నారు. పరశురామ్‌తో కలిసి 'గీత గోవిందం' అనే బ్లాక్ బస్టర్ మూవీ చేశారు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినమా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:
Next Story
Share it