Cheetah: తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో చిరుత

చిరుత సంచరించినట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఉంచి పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Cheetah: తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో చిరుత
X

న్యూస్ లైన్ డెస్క్: తిరుమల(Tirumala)లో మరోసారి చిరుత(Cheetah) కలకలం రేగింది. బుధవారం తెల్లవారుజామున చిరుత కనిపించినట్లు భక్తులు తెలిపారు. తిరుపతి(Tirupati) నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డు(ghat road)లో కారుకు చిరుత అడ్డుగా వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా, చిరుత సంచరిస్తున్న కొన్ని దృశ్యాలు సీసీకెమెరా(CC Camera)లో రికార్డ్(Record) అయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత సంచరించినట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఉంచి పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags:
Next Story
Share it