McDonald's: కూల్ డ్రింక్‌లో ఈగ, చీమలు

అక్కడ కూల్ డ్రింక్ ఆర్డర్ చేయగా అందులో గండు చీమలు, ఈగ దర్శనం ఇచ్చాయి.

McDonalds: కూల్ డ్రింక్‌లో ఈగ, చీమలు
X

న్యూస్ లైన్ డెస్క్: ఒకపక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున తనఖీలు నిర్వహిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్‌లో పాచిపోయిన ఫుడ్స్‌ను ఎలా సర్వ్ చేస్తున్నారో జనాలకు చెబుతున్నారు. అయినా కొంతమంది తమ నైజాన్ని మార్చుకోవడం లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పేరుతో అతి చేస్తున్నారు. తాజాగా ఎల్బీ నగర్ పరిధిలోని చింతలకుంటలోని మెక్డోనాల్డ్స్‌(McDonald's)కు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు(GHMC food safety officers) జరిమానా విధించారు. వివరాల ప్రకారం శనివారం సాయంత్రం ప్రవీణ్ అనే వ్యక్తి మెక్డోనాల్డ్స్‌కి వెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్ ఆర్డర్ చేయగా అందులో గండు చీమలు, ఈగ దర్శనం ఇచ్చాయి. ఇది ఏంటని మెక్డోనాల్డ్స్ సిబ్బందిని కస్టమర్ ప్రశ్నించగా ఏమి చేసుకుంటారో చేసుకోండంటూ వార్నింగ్ ఇచ్చాడు. మెక్డోనాల్డ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటూ గొప్పలకు పోయాడు. దీంతో చిర్రెత్తుకు వచ్చిన కస్టమర్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు పిర్యాదు చేశాడు. అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించగా మెక్డోనాల్డ్స్‌కు రూ.10,000 జరిమానా విధించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వాటిని సీజ్ చేయాలని కస్టమర్ ప్రవీణ్ కోరారు.

Tags:
Next Story
Share it