IPL: కరెన్ కనికరం లేకుండా కొట్టాడు భయ్యా..!

ఇండియన్ ప్రిమియర్ లీగ్ 17వ సీజన్‌లో భాగంగా బుధవారం సాయత్రం జరిగిన రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధిచింది.

IPL: కరెన్ కనికరం లేకుండా కొట్టాడు భయ్యా..!
X

కరెన్ కనికరం లేకుండా కొట్టాడు భయ్యా..!

కింగ్స్ చేతిలో రాయల్స్ పరాజయం

హాఫ్ సెంచరీతో చెలరేగిన కరెన్

కెప్టెన్ సంజు శాంసన్ కు నిరాశ

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 17వ సీజన్‌లో భాగంగా బుధవారం సాయత్రం జరిగిన రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధిచింది. పంజాబ్ బ్యాటర్స్ సామ్ కరెన్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాగా.. జితేష్ శర్మ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెప్టెన్ సామ్ కరెస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులో దిగిన కెప్టెన్ సంజు శాంసన్ ఇంగ్లాండ్ యువ బ్యాటర్ టామ్ కోహ్లర్-కాడ్మోర్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే టామ్ కోహ్లర్(18) రాహుల్ చాహర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ కాసేపటీకే శాంసన్(18) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆర్‌ఆర్ మూడు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ దూకుడు ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరోవైపు పరాగ్ గుజరాత్ బౌలర్లుకు ఊచకోత చూపించాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ విధ్వంస బ్యాటింగ్ చేశాడు. ఇక అశ్విన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డుకు 60 పరుగులు జతచేశారు. ఈ భగస్వామ్యని ఆర్షదీప్ సింగ్ విడగొట్టాడు. అశ్విన్(28) వికెటును ఆర్షదీప్ పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జూరెల్(0), రోమాన్ పోవెల్(4) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. పరాగ్ ఒంటరి పోరాటం చేశాడు. కానీ హర్షల్ పటేల్ పరాగ్‌(48)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రాజస్థాన్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు సామ్ కరెన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు తీశారు.

స్పల్ప లక్ష్యాని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదుకుదెబ్బ తగిలింది. ప్రబ్ సిమ్రాన్(3), రిల్లీ రోసోవ్(22), శాశంక్ సింగ్(0) పెవిలియన్‌కు చేశారు. దీంతో పంజాబ్ టాప్ ఆర్డర్ కూప్పకులింది. పంజాబ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. తర్వాత కెప్టెన్ సామ్ కరెన్ జానీ బెయిర్ స్ట్రోతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే బెయిర్ స్ట్రో(14) చాహల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన జితేష్ శర్మ కరెన్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో కరెన్ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్టేడియంలో మోత మోగించాడు. ఈ జోడి స్కోర్ బోర్డుకు 50 రన్స్ జోడించారు. అయితే జితేష్(22) చాహల్ బౌలింగ్ లో పెవిలియన్‌కు చేరాడు. వికెట్లు పడుతున్న ఆర్ఆర్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ కరెన్( 41 బంతుల్లో 63 పరుగులు 5 ఫోర్లు, 3 సిక్సర్ల )తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అసుతోష్ శర్మతో కలసి మంచి బ్యాటింగ్ చేశాడు. ఇక కరెన్(63), అసుతోష్(17) చివరి వరకు ఉండి మ్యాచ్ ను ఫినిష్ చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్ ఆర్ బౌలర్లు చాహల్, ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాగా.. ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.

Tags:
Next Story
Share it