Man: తాగి నీటిలో పడుకున్న వ్యక్తి.. అసలు విషయం తెలిస్తే షాక్!

మద్యం మత్తులో ఓ వ్యక్తి నీటిలో పడుకున్నాడు.

Man: తాగి నీటిలో పడుకున్న వ్యక్తి.. అసలు విషయం తెలిస్తే షాక్!
X

న్యూస్ లైన్ డెస్క్: మద్యం మత్తులో ఓ వ్యక్తి నీటిలో పడుకున్నాడు. కాగా, చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. తీరా వచ్చి చూస్తే పోలీసులకు షాక్ తగిలింది. హనుమకొండ, రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది మనించిన స్థానికులు కేయూ పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే 108 సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని అనుకున్నారు. తీరా బయటికిలాగి చూస్తే ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటలు సేపు ఎండకి పని చేసి తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. అయితే పోలీసులు వ్యక్తి సేవించడాని తెలిపారు. దీంతో వ్యక్తిని మందలించి ఇంటికి పంపించారు.

Tags:
Next Story
Share it