dogs attack: కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి

తండాలో నివాసం ఉండే గుగులోత్ మధు, సరిత దంపతులకు ఆరేళ్ల కుమారుడు గుగులోత్ శివరామ్ ఉన్నాడు. మధు, సరిత ప్లాన్ పనులు చేసుకొని జీవనం సాగించేవారు.

dogs attack: కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిచెందాడు. జనగామ(Janagaon) జిల్లా చిల్పూర్ మండల పరిధిలోని నునావత్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండాలో నివాసం ఉండే గుగులోత్ మధు, సరిత దంపతులకు ఆరేళ్ల కుమారుడు గుగులోత్ శివరామ్ ఉన్నాడు. మధు, సరిత ప్లాన్ పనులు చేసుకొని జీవనం సాగించేవారు. రోజులాగానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికొచ్చే సరికి ఇంట్లో బాలుడు కనిపించలేదు. కుక్కల అరుపులు వినిపించడంతో వెళ్లి చెట్ల పొదల్లో చూడగా బాలుడి మృతదేహం కనిపించిందని శివరామ్ తల్లిదండ్రులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని చుసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it