Afghanistan: భారీ వర్షాలు.. 300 మంది మృతి

భారీ వర్షాలు (heavy rains) ఆఫ్ఘనిస్తాన్‌ని (Afghanistan) అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బఘ్లాన్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో వరదనీరు (floods) పొంగిపోర్లుతుంది.

Afghanistan: భారీ వర్షాలు.. 300 మంది మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: భారీ వర్షాలు (heavy rains) ఆఫ్ఘనిస్తాన్‌ని (Afghanistan) అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బఘ్లాన్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో వరదనీరు (floods) పొంగిపోర్లుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 300 మంది వరకు మృతిచెంది ఉంటారని ఐక్యరాజ్యసమితి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించింది. ఈ ప్రమాదకరమైన విపత్తు కారణంగా భారీగా ఆస్తినష్టం జరగిందని అధికారులు చెబుతున్నారు.

ఈ భారీ వరదల కారణంగా బదాక్షన్, బఘ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయిని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేయగా, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దేశ రాజధాని కాబూల్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ వరదలకు దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు పలు సూచనలు చేశారు.

Tags:
Next Story
Share it