T20 Worldcup: సూపర్ ఓవర్లో అమెరికా విజయం..!

టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో భాగంగా గురువారం డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా జరిగిన అమెరికా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో యూఎస్‌ఏ గ్రాండ్ విక్టరీ సాధించింది.

T20 Worldcup: సూపర్ ఓవర్లో అమెరికా విజయం..!
X

సూపర్ ఓవర్లో అమెరికా విజయం..!

పాకిస్తాన్ పై యూఎస్ఏ గ్రాండ్ విక్టరీ

అర్ధ సెంచరీతో చెలరేగిన మోనాక్ పటేల్

ఆరోన్ జోన్స్ సూపర్ ఇన్నింగ్స్

3 వికెట్లతో విజృంభించిన నొస్తుష్

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో భాగంగా గురువారం డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా జరిగిన అమెరికా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో యూఎస్‌ఏ గ్రాండ్ విక్టరీ సాధించింది. అమెరికా బ్యాటర్స్ మోనాక్ పటేల్ ధనాధన్ అర్ధ సెంచరీతో చెలరేగగా.. ఆరోన్ జోన్స్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాంతో అమెరికా, పాకిస్తాన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపోందింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(9) సౌరభ్ నేత్రవల్కర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖాన్(3), ఫఖర్ జమాన్(11) బ్యాటింగ్‌లో నిరాశ పరించారు. దీంతో పాక్ 3 వికెట్లు కోల్పోయి 30 రన్స్ స్కోర్ చేసింది. బాబర్ ఆజం నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. షాదాబ్ ఖాన్‌తో కలిసి మంచి భగస్వామ్యని నెలకోల్పాడు. ఈ ఇద్దరు స్కోర్ బోర్డుకు 80 పరుగులు జోడించారు. అయితే షాదాబ్(40) నొస్తుష్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ కాసేపటికే అజాం ఖాన్(0) ని కూడా వెనక్కి పంపాడు. మరో ఎండ్ లో మంచి ఫామ్ లో ఉన్న కెప్టెన్ బాబర్(44) జాసదీప్ సింగ్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యుగా వెనుతిరిగాడు. తర్వాత ఇఫ్టిఖర్ అహ్మద్(18) నేత్రవల్కర్ ఓవర్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక చివరిలో షాహిన్ ఆఫ్రిది(23) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. యూఎస్‌ఏ బౌలర్లు నొస్తుష్ కేంజిగే మూడు మూడు వికెట్లతో విజృంభించగా.. సౌరభ్ నేత్రవల్కర్ రెండు వికెట్లు తీశాడు.

స్వల్ప టార్గెట్ ను ఛేదించేందుకు బరిలో దిగిన అమెరికా జట్టుకు ఓపెనర్లు మోనాక్ పటేల్, స్టీవెన్ టేలర్ మంచి ఆరంభాన్ని అందించారు. అయితే టేలర్(12) నసీమ్ షా బౌలింగ్ లో ఔటయ్యాడు. తర్వాత క్రీజులో దిగిన అండ్రీస్ గౌస్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ హడాలెత్తితిచాడు. మరోవైపు మోనాక్ డేంజరస్ బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు అమెరికా స్కోర్ బోర్డుకు 70 రన్స్ జతచేశారు. అయితే హరీష్ రాఫ్ అండ్రీస్(35) ను పెవిలియన్ కి పంపాడు. ఆ కాసేపటికే మోనాక్(50) మొహమ్మద్ అమిర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో అమెరికా నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో బ్యాటింగ్ కు ఆరోన్ జోన్స్(36) వచ్చాడు. పాక్ బౌలర్లకి ఊచకోత చూపించుడు. బౌండరీలు, సిక్సర్లు స్కోర్ చేశాడు. ఇక జోన్స్ ఆఖరిలో సిక్సర్ కొట్టే మ్యాచ్ ను టై చేశాడు. పాక్ బౌలర్లు నసీమ్ షా, హరీష్ రాఫ్, మొహమ్మద్ అమిర్ తలా ఒక ఓకెట్ తీశారు. ఇక సూపర్ ఓవర్లో అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్ మంచి బ్యాటింగ్ చేశాడు. దాంతో పాక్ కు 19 పరుగుల టార్గెట్ ను అమెరికా ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన పాకిస్తాన్ రన్స్ స్కోర్ చేయలేకపోయింది. దీంతో అమెరికా, పాకిస్తాన్ జట్టుపై 7 వికెట్ల తో గ్రాండ్ విక్టరీ సాధించింది.

Tags:
Next Story
Share it