T20 Worldcup: టాస్ గెలిచిన యూఎస్‌ఏ.. పాక్‌తో బిగ్ ఫైట్!

ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

T20 Worldcup: టాస్ గెలిచిన యూఎస్‌ఏ.. పాక్‌తో బిగ్ ఫైట్!
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇవాళ అమెరికా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీలో అమెరికా తమ మొదటి మ్యాచ్‌లో కెనడా జట్టుపై రికార్డ్ బ్రేకింగ్ చైజ్ చేసి ఘన విజయం సాధించింది. యూఎస్ఏ రెండో విజ‌యం సాధించాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు గ‌త సీజ‌న్ ర‌న్న‌ర‌ప్ బాబార్ ఆజాం సేన గెలుపుతో టోర్నీని ఘ‌నంగా ఆరంభించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. కాగా, పాక్ తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి.

జట్టు వివరాలు

అమెరికా జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, కోరీ ఆండర్సన్, హర్మీత్ సింగ్, నితీష్ కుమార్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, షాడ్లీ వాన్, నోస్తుష్ కెంజిగే.

పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (wk), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్, అమీర్, నసీమ్ షా.

Tags:
Next Story
Share it