AP: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

AP: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
X

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్‌ నిర్వహించగా ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు ఫలితాలను సోమవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. కాగా, ఈ ఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి వీటి ఆధారంగా ర్యాంకుల‌ు ఇచ్చారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్నికల్చరల్‌ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు.

ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లీక్ చేయండి: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

Tags:
Next Story
Share it