Murder: ములుగులో అంగ‌న్వాడీ టీచ‌ర్ హ‌త్య‌

బుధవారం తెల్లవారుజామున తునికాకు కోసం తాడ్వాయి సమీపంలోని అడవికి వెళ్లిన కూలీలకు సుజాత విగతజీఇవిగా కనిపించింది.

Murder: ములుగులో అంగ‌న్వాడీ టీచ‌ర్ హ‌త్య‌
X

న్యూస్ లైన్ డెస్క్: ములుగులో అంగన్‌వాడీ టీచర్(Anganwadi teacher) దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ఆమె మెడకు స్కార్ఫ్(Scarf) చుట్టి హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏటూరు నాగారంకు చెందిన సుజాత అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. రోజు లాగానే విధులు నిర్వహించి.. మంగళవారం మధ్యాహ్నం తన స్వగ్రామం ఏటూరు నాగారానికి బయలుదేరిందని అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. అయితే, ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బుధవారం తెల్లవారుజామున తునికాకు కోసం తాడ్వాయి సమీపంలోని అడవికి వెళ్లిన కూలీలకు సుజాత విగతజీఇవిగా కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారంతో పాటు ఒక సెల్ ఫోన్(phone) కూడా కనిపించకుండా పోయాయని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, బంగారం కోసమే ఆమెను హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Tags:
Next Story
Share it