AP: ఢిల్లీకి సీఎస్, డీజీపీ

ఏపీ (AP) సీఎస్ జవహర్ రెడ్డి (cs jawahar reddy), డీజీపీ హరీశ్ కుమార్ (dgp harish kumar) ఢిల్లీ (delhi) చేరుకున్నారు. అక్కడ ఈసీతో (EC) భేటీ అయ్యారు.

AP: ఢిల్లీకి సీఎస్, డీజీపీ
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ (AP) సీఎస్ జవహర్ రెడ్డి (cs jawahar reddy), డీజీపీ హరీశ్ కుమార్ (dgp harish kumar) ఢిల్లీ (delhi) చేరుకున్నారు. అక్కడ ఈసీతో (EC) భేటీ అయ్యారు. ఏపీలో (AP) ఎన్నికలు జరిగిన తర్వాత చెలరేగిన హింసపై ఈసీ వారిని వివరణ కోరినట్లు తెలుస్తుంది. హింసను అదుపులోకి తెచ్చేందుకు తీసుకున్న చర్యలపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. బుధవారం ఏపీ సీఎస్, డీజీపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సమ్మన్లు పంపించింది. ఎన్నికల తరువాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీకి రావాలని ఏపీ సీఎస్, డీజీపీని సీఈసీ ఆదేశించిగా.. వారు ఇవాళ ఢిల్లీ వెళ్లి ఈసీని భేటీ అయ్యారు.

Tags:
Next Story
Share it