Murder attempt: టీడీపీ అభ్యర్థి బాడీగార్డుపై హత్యాయత్నం

మంగళవారం జరిగిన ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగక ముందే మరో రాజకీయ కక్ష పూరిత ఘటన జరిగింది.

Murder attempt: టీడీపీ అభ్యర్థి బాడీగార్డుపై హత్యాయత్నం
X

న్యూస్ లైన్ డెస్క్: నంద్యాల(Nandyala) జిల్లా ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్(Polling) ముగిసిన నాటి నుండి పార్టీల మధ్యన జరుగుతున్న ఆందోళనలు.. ఏకంగా వ్యక్తిగత దాడుల వరకు వెళ్లాయి. మంగళవారం జరిగిన ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగక ముందే మరో రాజకీయ కక్ష పూరిత ఘటన జరిగింది. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ(Akhila priya) బాడీగార్డ్(Body guard)పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. రాత్రి 12 గంటల సమయంలో నిఖిల్‍(Nikhil)ను కారుతో ఢీ కొట్టి హత్య చేసేందుకు యత్నించారు. కిందపడిన నిఖిల్‍పై ఇనుప రాడ్లతో దాడి చేశారు. నిఖిల్ వారి నుండి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరా(CC Camera)లో రికార్డ్ అయింది. కాగా, దీనిపై స్పందించిన అఖిలప్రియా.. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆదారంగా దర్యాప్తు చేపట్టారు.

Tags:
Next Story
Share it