Under 19 Final: ఫైనల్‌లో యువ భారత్ హ్యాండ్స్ అప్!

ఆస్ట్రేలియా తన నాలుగో టైలిల్ ను కైవసం చేసుకుంది.

Under 19 Final: ఫైనల్‌లో యువ భారత్ హ్యాండ్స్ అప్!
X

న్కూస్ లైన్ స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్ ముందు 253 పరుగుల భారీ లక్ష్యని పెట్టింది. హర్జాస్ సింగ్ (55) ఆర్థశతకంతతో రాణించాడు. వీబ్జెన్(48),డిక్సన్(42), ఆలివర్ పీక్(41) పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నషానికి 253 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన ఆసీస్ ప్రారంభంలోనే మొదటి వికెట్ కోల్పోయింది. సామ్ కొంటాస్ రామ్ లింబానరీ ఓ చక్కని బల్‌తో అతన్న బౌల్డ్ చూశాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వీబ్జెన్(48), హ్యారీ డిక్సన్(42) తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దారూ రెండో వికెట్‌కు 78 రన్స్ జోడించారు. ఇక ఈ జోడిని నామన్ తివారీ విగడోట్టాడు. ఒక్కే ఓవర్‌లో ఇద్దరిని ఔట్ చేశారు. ఈ క్రమంలో 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆసీస్. ఇక క్రీజులో దిగిన హర్జాన్, ర్యాన్ హిక్స్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. నిలకడగా ఆడుతూ.. బౌండరీలు సాధించారు. అనంతరం భారత్ బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది. భారత బౌలర్లు లింబానీ 3 వికెట్లు పడగొట్టాగా.. నామన్ తివారీ 2, సామీ, ముషీర్ ఖాన్ చెరో వికెట్లు తీసుకున్నారు.

ఇక భారీ లక్ష్యని ఛేదించే దిశగా భారత ఓపెనర్లు క్రీజులో దిగారు.. బ్యాటర్ అర్షిన్ కులకర్ణి బౌండరీ కొట్టే క్రమంలో ర్యాన్ హిక్స్ కు క్యాచ్ ఇచ్చి కల్లమ్ విడ్లర్ బౌలింగ్ లో ఔట్‌ అయ్యాడు. ఆదర్శ్ సింగ్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ దశలో భారత్ మొదటి వికెట్ కొల్పొయి 50 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ముషీర్ ఖాన్ ఆదర్శ్ తో మంచి భాగస్వామ్యని నెలకొల్పడు. ఈ ఇద్దారు కలిసి 40 పరుగులు జోడించారు. మహ్లీ బార్డ్‌మాన్ వేసిన చక్కని బల్‌తో ముషీర్ బౌల్డ్ చూశాడు. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మంచిగా రాణించిన కెప్టెన్ ఉదయ్ సహారన్ ఈ మ్యాచ్‌లో విఫలమైయ్యాడు. మహ్లీ బార్డ్‌మాన్ వేసిన బల్‌లో హ్యూ వీబ్జెన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సచిన్ దాస్(9), ప్రియాంషు మోలియా(9), అరవెల్లి అవనీష్(0), వరుసగా విఫలమైయ్యారు. ఆదర్శ్, మురుగన్ అభిషేక్ తో కలిసి ఇన్నింగ్స్ ను సరిదిద్దారు. కాగా, ఆసీస్ బౌలర్ మహ్లీ బార్డ్‌మాన్ వేగం ముందు ఆదర్శ్(47) బోల్తా పడ్డాడు ర్యాన్ హిక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాజ్ లింబానీ ఇలా వచ్చి అలా పివిలియన్ కు చేరాడు. భారత్ ను గెలుపు అచులదక తీసుకెళ్లిన అభిషేక్.. కల్లమ్ విడ్లర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివరి దాకా పోరాడిన నామన్ తివారీ, సౌమీ పాండే నిరాశే మిగిలింది. దీంతోఆస్ట్రేలియా తన నాలుగో టైలిల్ ను కైవసం చేసుకుంది.

Tags:
Next Story
Share it