Bangladesh: బంగ్లాదేశ్‌ కొత్త సారథిగా నజ్ముల్‌ హోసెన్‌ శాంటో

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌గా నజ్ముల్‌ ను ప్రకటించింది బీసీబీ.

Bangladesh: బంగ్లాదేశ్‌ కొత్త సారథిగా నజ్ముల్‌ హోసెన్‌ శాంటో
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌గా నజ్ముల్‌ ను ప్రకటించింది బీసీబీ. ఐసీసీ అనుసరిస్తున్న ఫార్ములాకు పూర్తి భిన్నంగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు మూడు ఫార్మాట్లకూ ఒక్కడే సారథిని నియమించింది. బంగ్లా స్టార్‌ బ్యాటర్‌గా ఉన్న నజ్ముల్‌ హోసెన్‌ శాంటోను టెస్టులతో పాటు వన్డే, టీ20 లకు కెప్టెన్‌గా చేసింది. ఇటీవల న్యూజిలాండ్‌ టూర్‌లో.. షకిబ్‌ అల్‌ హసన్‌ గైర్హాజరీ అయ్యాడు కాగా, నజ్ముల్‌ జట్టును నడిపించాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో షకిబ్‌ సారథ్యంలోనే ఆడినా ఆ తర్వాత అతడు ఎంపీగా గెలవడం, కన్నుకు గాయం కావడంతో కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉంటానని చెప్పడంతో బీసీబీ కొత్త సారథిని నియమించింది. శాంటో ఏడాదిపాటు మూడు ఫార్మాట్లకూ కెప్టెన్‌గా ఉంటాడని బీసీబీ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

శాంటో 2017లో జాతీయ జట్టులో అరంగేట్రం చేశాడు.. ఇప్పటివరకూ 25 టెస్టులు, 42 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులలో 1,449 పరుగులు చేసిన శాంటో.. వన్డేలలో 1,202 పరుగులు, టీ20లలో 602 రన్స్‌ చేశాడు. శాంటో సారథ్యంలో మార్చిలో బంగ్లాదేశ్‌ జట్టు.. శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను ఆడాల్సి ఉంది. అయితే కొత్త కెప్టెన్‌తో పాటు బంగ్లా జట్టుకు కొత్త చీఫ్‌ ఘాజీ అష్రఫ్‌ హోసెన్‌ను బీసీబీ జాతీయ సీనియర్‌ జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌గా నియమించింది. కాగా, హన్నన్‌ సర్కార్‌ కొత్త సెలక్టర్‌గా ఎంపికయ్యాడు. ఇక గతంలో చీఫ్‌ సెలక్టర్‌గా మినహజుల్‌ అబేదిన్‌ ఉండగా.. సెలక్టర్‌గా హబీబుల్‌ బాషర్‌లు సేవలందించారు.

Tags:
Next Story
Share it