Boinapalli: కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బోయినపల్లి వినోద్ కుమార్

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Boinapalli: కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బోయినపల్లి వినోద్ కుమార్
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండల కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పొలాల బాట పట్టేసరికి కాంగ్రెస్‌లో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు నీళ్లు లేవని.. కేసీఆర్ బయటకు రాగానే గాయత్రి పంప్ హౌస్‌లో మోటార్లు ఎలా నడుపుతున్నారని వినోద్ కుమార్ నిలదీశారు.

అబద్దపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు.. తీరా అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయలేక ఆగమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీల్లో రైతుభరోసా కింద రూ.15000, కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్‌తోపాటు తులం బంగారం ప్రతి మహిళకు రూ.2500ల సాయం , రైతు రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని.. బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పోటీలో ఉంచిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ కు తనను పంపిస్తే ప్రజలకు రావాల్సిన నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు.

Tags:
Next Story
Share it