AP: విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం ఉంటుంది

విశాఖలో జగన్ మళ్లీ యుఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

AP: విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం ఉంటుంది
X

న్యూస్ లైన్ డెస్క్: విశాఖలో జగన్ మళ్లీ యుఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియా సమావేశం నిర్వహించిన బొత్స మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ హయంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మళ్లీ వస్తున్నాయిని అన్నారు. ఎన్నికలో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు సహనం కోల్పోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సంయమనం పాటిస్తున్నామని, మా నేతలకు ఓ పిలుపునిస్తే అంతా నిమిషంలో మారిపొతుందని తెలిపారు. మేము అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారని తెలిపారు. జూన్ 9న విశాకలో రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వ రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్‌లో పెద్దఎతున్న పాల్గొన్నారని అన్నారు.

Tags:
Next Story
Share it