Mla Kotha prabhakar: రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసింది

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు 500 రూపాయలు బోనస్ కోసం ధర్నాకు దిగారు.

Mla Kotha prabhakar: రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసింది
X

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు 500 రూపాయలు బోనస్ కోసం ధర్నాకు దిగారు. దుబ్బాక, బస్టాండ్ వద్ద గురువారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. రైతులు పండించిన వరి ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఇంతవరకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పండిన వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు. అయితే నిన్న మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రైతంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన 500 రూపాయలు బోనస్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it