RSP: సీఎం రేవంత్ రెడ్డి అండతోనే దాడులు

కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కార్యకర్తలపై చేసిన దాడిని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.

RSP: సీఎం రేవంత్ రెడ్డి అండతోనే దాడులు
X

న్యూస్ లైన్ డెస్క్: నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కార్యకర్తలపై చేసిన దాడిని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రవి గుప్తాకు ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి గురువారం హైదారాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో కలిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ గుండాలు మరణాయుధాలతో దాడి చేసి, హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అచ్చంపేటలో అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులకు పాల్పడ్డారని తెలిపారు. వంగూరులో పోలింగ్ రోజు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని తెలిపారు. కాంగ్రెస్ గుండాలతో బీఆర్ఎస్ నేతలకు ప్రాణహాని ఉందని, వారికి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా ప్రాంత్లాలో అధికార పార్టీ గుండాలు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు. మళ్ళీ నయీం ముఠాలు బయటికొస్తున్నారని అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధీనంలో ముఠాలు ఆశ్రయం పొందుతున్నారని ఆరోపించారు. అచ్చంపేట, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు గన్ మెన్‌లతో భద్రత కల్పించాలని కోరారు.

జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో కొల్లాపూర్ లో బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని అన్నారు. భారాస సీనియర్ నేత మన్నె క్రిశాంక్ వాట్సప్ లో పోస్ట్ చేస్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేశ్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతాయని ఎస్పీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరగడం చాలా ఘోరం అని, కాంగ్రెస్ ఆరు నెలలు కాకముందే అరాచక శక్తులు మళ్ళీ పుంజుకున్నాయని అన్నారు. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఇలాంటి గుండాలపై రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మరే అవకాశం ఉందని అన్నారు.

Tags:
Next Story
Share it