RSP: కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తుంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో అచ్చంపేటలో కాంగ్రెస్ గుండాలు అరాచక పాలన సాగిస్తున్నారని ఆర్‌ఎస్‌పీ అన్నారు

RSP: కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తుంది
X

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో అచ్చంపేటలో కాంగ్రెస్ గుండాలు అరాచక పాలన సాగిస్తున్నారని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ గుండాలు మరణాయుధాలతో దాడి చేసి, అత్యాయత్నం చేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలో దాడులు జరిగినా నిందితులను అరెస్టు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రేక్షక పాత్ర వహించడం పట్ల ఓ మాజీ ఐపీఎస్ అధికారిగా సిగ్గుపడుతున్నానని అన్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఉండడం వల్లే సకాలంలో పోలీసులు సంఘటన స్థలానికి రాలేదని ఆరోపించారు.

సుమారు 20 మంది కాంగ్రెస్ నాయకులు బాలరాజు ఇంటిపై కర్రలతో దాడి చేసి, తలుపులు బద్దలు కొట్టి,అడ్డుకున్న కుటుంబ సభ్యులను గాయపరచడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందిన అదనపు బలగాలను మొహరించి దాడిని అడ్డుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. కౌన్సిలర్ బాలరాజు ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, నిందితులతో బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. పోలీసుల కళ్ళముందే నిందితులు కర్రలతో దాడి చేసినా ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని అచ్చంపేట డీఎస్పీ తెలపడం నిందితులను రక్షించడమేనన్నారు. అచ్చంపేటలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కళ్ళ ముందు మారణాయుధాలతో దాడి చేసిన నిందితులను పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు, పరారీలో ఉన్న వారిని ఎలా పట్టుకుంటారని ప్రశ్నించారు. వంగూరులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట నరేందర్ రావుపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి భయపనితుల గురిచేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ గుండాలు నరేందర్ రావు తమ్ముడు ప్రశాంత్ రావును విపరీతంగా కొట్టారని, దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడిన నిందితులపై అత్యాయత్నం కేసు నమోదు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డా.గువ్వల బాలరాజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:
Next Story
Share it