Krishank: సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థపై విచారణ జరపాలి

సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థపై విచారణ జరపాలని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.

Krishank: సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థపై విచారణ జరపాలి
X

న్యూస్ లైన్ డెస్క్: సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థపై విచారణ జరపాలని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో క్రిశాంక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమ్ డిస్టిలరీస్ నుండి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందినాయిని, దీని మీద పూర్తి ఆధారాలు మీడియాకు ఇచ్చామన్నారు. ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ సంస్థను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు. సోమ్ డిస్టిలరీస్ సంస్థకు ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయడమే కాదు, ఆ సంస్థకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కంపెనీ నుంచి ఎవరెవరికి కమిషన్లు అందయనే దానిపై విచారణ జరగాలని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it