KTR: తలసాని సోదరుడుకు నివాళులు అర్పించిన కేటీఆర్‌

తలసాని శంకర్ యాదవ్ అంతిమ యాత్రకు హాజరై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నివాళులు అర్పించారు.

KTR: తలసాని సోదరుడుకు నివాళులు అర్పించిన కేటీఆర్‌
X

న్యూస్ లైన్ డెస్క్: మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు తలసాని శంకర్ యాదవ్ అంతిమ యాత్రకు హాజరై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నివాళులు అర్పించారు. మోండా మార్కెట్ నుంచి బన్సీలాల్ పేటలోని గ్రేవ్ యార్డ్ వరకు సాగిన అంతిమయాత్రలో కేటీఆర్‌, మాజీ మంత్రులు మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వే సత్యనారాయణ శంకర్ యాదవ్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. అయితే శంకర్ యాదవ్(61) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Tags:
Next Story
Share it