Trailer: ‘చారి 111’ ట్రైల‌ర్ ఔట్.. స్పై ఏజెంట్‌‌గా వెన్నెల కిషోర్!

తాజాగా మూవీ మేక‌ర్స్ ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

Trailer: ‘చారి 111’ ట్రైల‌ర్ ఔట్.. స్పై ఏజెంట్‌‌గా వెన్నెల కిషోర్!
X

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ సినిమా ‘చారి 111’. ఇక ఈ మూవీలో సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ ప్రేక్షకుల ఆకట్టుకుంది. తాజాగా మూవీ మేక‌ర్స్ ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

ఇక ట్రైలర్ చూస్తే.. 1992లో ఇండియా – పాకిస్థాన్ క‌లిసి ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక‌పై రెండు దేశాల్లో ఎలాంటి అణ్వాయుధాలు గానీ బయోలాజికల్ ఆయుధాలు కానీ త‌యారు చేయగూడదు అనే సంభాషణతో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. టెర్ర‌రిజంకు చెందిన‌ ఒక సీక్రెట్ గ్రూప్ కోవర్ట్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనీ చూస్తుంది. ఒక‌వేళ అది స్టార్ట్ అయితే దేశానికి ప్రమాదం. ఇక ఇది క‌నిపేట్టే సీక్రెట్ స్పైగా ఏజెంట్‌గా వెన్నెల కిషోర్ క‌నిపించ‌నున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్​గా కనిపించనున్నారు. ట్రైల‌ర్ మొత్తం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సాగింది. ఈ మూవీను బర్కత్‌ స్టూడియెస్‌ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది.

Tags:
Next Story
Share it