rally: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు చెన్నూరు రైతుల నిరసన

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పోరాడాలని రైతన్నలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

rally: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు చెన్నూరు రైతుల నిరసన
X

న్యూస్ లైన్ డెస్క్: అధికారంలోకి వస్తే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్(Bonus) చెల్లిస్తామాని సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రకటించారు. అయితే, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని మాట మార్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు(Farmers) కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) మరోసారి వచించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పోరాడాలని రైతన్నలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే చెన్నూరుకు చెందిన రైతులు.. రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం మద్దతు ధరపై రూ.500 బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. రైతన్నలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించిన వారి నిరసనలను ఆదుకునేందుకు ప్రయత్నించారు.

Tags:
Next Story
Share it