Gandhi Bhavan : గాంధీభవన్‌ ధగ్గర ఏఈఈ అభ్యర్థుల నిరసన

తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ అభ్యర్థులు (AEE Aspirants) గాంధీభవన్‌ను ముట్టడించారు.

Gandhi Bhavan : గాంధీభవన్‌ ధగ్గర  ఏఈఈ అభ్యర్థుల నిరసన
X

న్యూస్ లైన్ డెస్క్ : గాంధీ భవన్ దగ్గర ఏఈఈ అభ్యర్థులు నిరసన చేస్తున్నారు. తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ అభ్యర్థులు (AEE Aspirants) గాంధీభవన్‌ను ముట్టడించారు. గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న ఏఈఈ అభ్యర్థులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్కి రాని ఏఈఈ అభ్యర్థులు (AEE Aspirants) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకు, అధికారులకు ఎన్నసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆందోళన చేస్తున్నారు. మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేసిన కమిషన్, డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వని కమిషన్ లీకేజీ వల్ల ఇప్పటికే ఏడాది సమయాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. నోటిఫికేషన్ వచ్చి రెండేళ్లు గడిచినా ఇంకా రిక్రూట్మెంట్ పూర్తి కాలేదని వారు వాపోతున్నారు.

Tags:
Next Story
Share it