Cm Revanth: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Cm Revanth: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం సమీక్ష
X

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై సీఎం దాదాపు గంటసేపు అధికారులతో చర్చించారు. పంట రుణమాఫీకి అయ్యే ఖర్చు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించాలని అధికారులకు తెలిపారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తదితర శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Tags:
Next Story
Share it