Smuggling: విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా రవాణ అవుతున్న 13.5 కిలోల బంగారాన్ని సోమవారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

Smuggling: విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
X

న్యూస్ లైన్ డెస్క్: చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా రవాణ అవుతున్న 13.5 కిలోల బంగారాన్ని సోమవారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కాగా, ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది చేతివాటం గుర్తించిన అధికారులు వారి నుంచి 13.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్‌లో శ్రీలంక ప్రయాణికుడికి సహకరించిన ఇద్దరు విమానాశ్రయ సిబ్బందిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. పట్టుకున్న బంగారం విలువ 8.5కోట్లుగా ఉంటుందని అధికారుల అంచనా. అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు స్మగ్లర్లకు సహకరిస్తుండడంతో ఈ విషయం చర్చనీయాంశం మారింది.

Tags:
Next Story
Share it