Delhi: సీఎస్, డీజీపీకి ఈసీ సమన్లు

ఏపీ (ap) సీఎస్, డీజీపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) సమ్మన్లు పంపించింది. ఎన్నికల తరువాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.

Delhi: సీఎస్, డీజీపీకి ఈసీ సమన్లు
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ (ap) సీఎస్, డీజీపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) సమ్మన్లు పంపించింది. ఎన్నికల తరువాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. కొనసాగుతున్న హింసను ఎందుకు అరికట్టలేకపోయారో వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar reddy), డీజీపీ హరీశ్ కుమార్‌ (dgp harish kumar) లకు సీఈసీ (CEC) సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి రావాలని ఏపీ సీఎస్, డీజీపీకి సీఈసీ ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్‌లు పూర్తిగా విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.

ఏపీలో నిన్న, ఇవాళ తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. పల్నాడు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లతో షాపులు బంద్ చేయించిన పోలీసులు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైనా ప్రతిదాడికి దిగిన ప్రత్యర్థులు. ఏపీలో ఇంకా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి.

Tags:
Next Story
Share it