Pushpa 2: పుష్ప-2 మూవీ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఐటమ్ సాంగ్!

పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఉ..ఉ.. అంటావా మావా..’ పాట ఛాట్‌ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Pushpa 2: పుష్ప-2 మూవీ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఐటమ్ సాంగ్!
X

న్యూస్ లైన్ సినిమా: పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఉ..ఉ.. అంటావా మావా..’ పాట ఛాట్‌ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ పాటలో సమంత స్క్రీన్‌ ప్రెజన్స్‌ మామూలుగా ఉండదు. తన అందంతో అభినయంతో యువతరాన్ని ఉర్రూతలూగించింది సమంత. ఇక దేవిశ్రీ మ్యూజిక్, ఇంద్రావతి స్వరం, చంద్రబోస్‌ సాహిత్యం ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెప్పాలి. ఇక ‘పుష్ప2’ మూవీలో కూడా ఇలాంటి ఐంటమ్‌ సాంగ్ ను దర్శకుడు సుకుమార్ ఫ్లాన్ చేస్తున్నారు. అది కూడా తొలి పార్ట్‌లోని ఐటమ్‌నంబర్‌కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉండాలి. ఇక ఈ ఐంటమ్ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేశారు సుకుమార్‌. తొలి పార్ట్‌లోని పాటను మించేలా అద్భుతమైన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ దేవిశ్రీ ఆందిస్తున్నట్లు సమచారం.

తాజాగా డైరెక్టర్ సూకుమార్ దిశా ఐటమ్‌సాంగ్‌ షుటింగ్ షురూ చేశాడు. ఇక దిశా పటానీ స్టార్ డైరెక్టర్ పూరీజగన్నాథ్‌ ‘లోఫర్‌’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో ఎం.ఎస్‌.ధోనీ, బాగీ2, బాగీ3, ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ సినిమాలు చేస్తూ.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక త్వరలో విడుదల కానున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏ.డి’, సూర్య ‘కంగువ’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది దిశా పటానీ.

Tags:
Next Story
Share it