Watch Video: గ్రామాలపై ఏనుగుల దాడి..రైతు మృతి

కరంజి అభయారణ్యంలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఏనుగు కొమురంభీం జిల్లా చింతలమా‌‌నపల్లి ( CHINTAMANAPALLI) మండలంలో గ్రామాలపై దాడి చేశాయి.

Watch Video: గ్రామాలపై ఏనుగుల దాడి..రైతు మృతి
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కాగజ్‎నగర్( KAGAJNAGARA) కారిడార్‎లో ఏనుగు బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర గడ్చిరోలి అభయారణ్యం నుంచి‌ దారి తప్పి కరంజి అభయారణ్యంలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఏనుగు కొమురంభీం జిల్లా చింతలమా‌‌నపల్లి ( CHINTAMANAPALLI) మండలంలో గ్రామాలపై దాడి చేశాయి. ప్రాణహిత దాటి చింతలమానపల్లి మండలం బూరెపల్లి పంటపొలాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏనుగు.. మిర్చి పంటలో భీభత్సం సృష్టించింది. పొలాలను పాడుచేయడమే కాకుండా దగ్గర్లో పొలం పనులు చేస్తున్న రైతులపై దాడికి యత్నించాయి.ఈ దాడిలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

రైతుపై దాడి చేసి గ్రామంలోకి ఏనుగు ఎంట్రీ ఇవ్వడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ‌ఇచ్చి‌న స్థానికులు కర్రలతో ఏనుగును అభయారణ్యంలోకి తరమారు. ప్రాణహిత దాటి తిరిగి‌ ఏనుగు మహారాష్ట్ర గడ్చిరోలి అభయారణ్యంలోకి వెళ్లే అవకాశం ఉందంటూ తెలిపారు అటవిశాఖ అధికారులు.

అయితే ఏనుగలు ఎండలు కావడంతో మంచి నీరు కోసం ఇలా దారి తిప్పి గ్రామాల్లోకి చొరబడుతుంటాయంటున్నారు ఫారెస్ట్ అధికారులు. వీలైనంత వరకు ఎండాకాలం జంతువులకు నీటిని అందిస్తున్నామని ఇక పై ఇలాంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

Tags:
Next Story
Share it