kodangal: నారాయణపేట-కొడంగల్ లిప్ట్‌ వల్ల ఆర్ధిక భారం

అధికారంలోకి రాగానే నారాయణపేట-కొడంగల్ లిప్ట్‌ను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముందుగా సొరంగ మార్గాలను కూడా నిర్మించారు.

kodangal: నారాయణపేట-కొడంగల్ లిప్ట్‌ వల్ల ఆర్ధిక భారం
X

న్యూస్ లైన్ డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని గతంలో ప్రతిపాదన వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) దీన్ని పక్కన పెట్టింది. అధికారంలోకి రాగానే నారాయణపేట-కొడంగల్ లిప్ట్‌ను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కోసం ముందుగా సొరంగ మార్గాలను కూడా నిర్మించారు. అయితే, దీన్ని కాదని కొత్తగా ప్రెషర్ మెయిన్స్(pressure mains) నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఏటా మైంటేనన్స్ ఛార్జీలు అధికమవుతున్నాయి. మరోవైపు లిఫ్ట్ అంచనా వ్యయం రూ. 3117 కోట్ల నుండి రూ. 4350 కోట్లకు పెంచేశారు. దీంతో నారాయణపేట-కొడంగల్ లిప్ట్‌తో ఆర్ధిక భారం పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags:
Next Story
Share it