Cabinet: మోడీ నివాసంలో తొలి కేబినెట్ భేటీ

రానున్న 100 రోజుల ప్రణాళికపై సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ప్రధాని కేంద్రమంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.

Cabinet: మోడీ నివాసంలో తొలి కేబినెట్ భేటీ
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. మోడీ మూడో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి.. కొత్త మంత్రి వర్గం ఏర్పడిన తరువాత నిర్వహించిన తొలి సమావేశం కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో కేంద్ర మంత్రులకు శాఖలను కూడా కేటాయించే అవకాశం ఉంది. రానున్న 100 రోజుల ప్రణాళికపై సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ప్రధాని కేంద్రమంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కీలక శాఖలు అన్నీ బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలకు చెందిన కేంద్ర మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు అనే అంశంపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags:
Next Story
Share it