Geetha Harshini: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన గీతా హర్షిణి!

స్థానిక మండల కేంద్రంలోని అంకంపాలెం స్కూల్ విద్యార్థిని రవ్వ గీతా హర్షిణి హనుమకొండ రాష్ట్రస్థాయిలో జరిగిన రెజ్లింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది.

Geetha Harshini: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన గీతా హర్షిణి!
X

న్యూస్ లైన్, దమ్మపేట: స్థానిక మండల కేంద్రంలోని అంకంపాలెం స్కూల్ విద్యార్థిని రవ్వ గీతా హర్షిణి హనుమకొండ రాష్ట్రస్థాయిలో జరిగిన రెజ్లింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు అధికారి ప్రీతిక్ జైన్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7, 8 తేదీలలో హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన అండర్ 15 రెజ్లింగ్ పోటీలలో తన సత్తాను చాటి గోల్డ్ మెడల్ సాధించడం గొప్ప విషయమని ఇంకా మున్ముందు జాతీయ పోటీల్లో కూడా పాల్గొని మంచి విజయం సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గీత హర్షిణి ని అభినందించారు. పాటియాలా పంజాబ్ లో జరుగు జాతీయ స్థాయి లో 9వ తరగతి చదువుతున్న గీత హర్షిణి పాల్గొంటుందన్నారు. జాతీయ స్థాయి లో కూడ గోల్డ్ మెడల్, సాదించాలి అని, అభినందించారు.

ఈ క్రమంలోనే స్కూలు ప్రధానోపాధ్యాయులు టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26వ తేదీ నుండి పంజాబ్ పాట్యాలలో జాతీయ రెజ్లింగ్ పోటీల్లో గీతా హర్షిని పాల్గొనాల్సి ఉందని ఆమెకు మనందరి ఆశీస్సులు కావాలని కోరారు. పాఠశాల విద్యార్థినులను సోర్స్ విభాగంలో తీర్చిదిద్దుతున్నందుకు స్పోర్ట్స్ ఆఫీసర్ బొల్లి గోపాలరావును డిప్యూటీ, డైరెక్టర్ మణెమ్మ ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా రవ్వ గీత హర్షినిణి కి అభినందనలు తెలిపిన వారిలో ఏ పీ ఓ. డేవిడ్, రాజు . ఏ ఎస్ ఓ కె.వెంకటనారాయణ, పిఈటి జి . రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:
Next Story
Share it