Gurukul Aspirants : సీఎం ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు నర్సింగ్ స్టాఫ్ నిరసన

గురుకుల అభ్యర్థులు సీఎం (CM) రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మోకాళ్లపై నిల్చుని దండంపెడుతూ నిరసనకు దిగారు.

Gurukul Aspirants : సీఎం ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు నర్సింగ్ స్టాఫ్ నిరసన
X

న్యూస్ లైన్ డెస్క్: గురుకుల అభ్యర్థులు సీఎం (CM) రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మోకాళ్లపై నిల్చుని దండంపెడుతూ నిరసనకు దిగారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు (Gurukula Board) వల్ల తాము నష్టపోయామని వారు అన్నారు. బోర్డు తప్పిదాలతో సరైన పద్దతిలో నియామక ప్రక్రియ జరుగకపోవడంతో ఒక్కొక్కరికి మూడు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. దాంతో చాలా మంది నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని గురుకుల అభ్యర్థులు (Gurukul Aspirants) విజ్ఞప్తి చేశారు. బోర్డు చేసిన తప్పులను తమపై రుద్దొద్దని, తమకు న్యాయం చేయాలని కోరారు. న్యాయస్థానం కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయినా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అంటూ కొన్నాళ్లు వెళ్లదీశారని, ఇప్పుడు స్కూల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇంకెప్పుడు మా నియామకాలు చేపడతారు అని ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వారు అడ్డుకున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నర్సింగ్ స్టాఫ్ (Staff Nurse) నిరసనకు దిగారు. దాంతో పోలీసులు అక్కడకు చేరుకుని నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశారు.

Tags:
Next Story
Share it