Harish Rao: రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ టూర్

సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ది కోసమే మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తున్నారు

Harish Rao: రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ టూర్
X

న్యూస్ లైన్ డెస్క్: మాజీ మంత్రి హారీశ్ రావు (harish rao) సీఎం రేవంత్ రెడ్డిపై (cm revanth reddy) తీవ్ర విమర్శాలు చేశారు. తెలంగాణ (telangana) శాసనసభ (assembly) రేపటికి వాయిదా పడింది. అనంతరం హారీశ్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ది కోసమే మేడిగడ్డ బ్యారేజీని (medigadda barrage) సందర్శిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (kaleshwaram project) అంటే మేడిగడ్డ ఒకటే కాదని, కాళేశ్వరం ఫలితాలు మీకు తెలియకపోతే వెళ్లేటప్పుడు రైతులను అడిగి తెలుసుకొండన్నారు. పిల్లర్ కుంగిపోయినదాన్ని సీఎం రేవంత్ దాని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను సీఎం రేవంత్ సందర్శించాలని హారీశ్ రావు సూచించారు.

Tags:
Next Story
Share it