Rains: హైద‌రాబాద్‌లో దంచికొడుతున్న వాన

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మొరుపులతో కుడిన భారీ వ‌ర్షం కురుస్తోంది

Rains: హైద‌రాబాద్‌లో దంచికొడుతున్న వాన
X

న్యూస్ లైన్ డెస్క్: హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మొరుపులతో కుడిన భారీ వ‌ర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వాతావరణం పొడిగానే ఉంది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. రాబోయే రెండు నుంచి మూడు గంట‌ల గంట‌ల వ‌ర‌కు న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ కేంద్రం హెచ్చ‌రించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూసించింది. ఇక భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్ హోల్, నాలల దగ్గర నీళ్లు నిండిపోయాయి. హైదరాబాద్‌లోని కాప్రా, ద‌మ్మాయిగూడ‌, ఈసీఐఎల్, నేరెడ్‌మెట్‌, ఎల్‌బీన‌గ‌ర్‌, ఉప్ప‌ల్, కొంప‌ల్లి, జీడిమెట్ల‌, దుండిగ‌ల్, జ‌గ‌ద్గిరిగుట్ట‌, కూక‌ట్‌ప‌ల్లి, ప‌టాన్‌చెరు, గ‌చ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, మియాపూర్, బేగంపేట్‌, ముషీరాబాద్‌, ఓయూ, తార్నాక‌, సరూర్‌న‌గ‌ర్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వానలు దంచికొడుతోంది. అటు రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, షాపూర్నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జవహర్ నగర్, అల్వాల్, గాజులరామారం, ప్రగతినగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags:
Next Story
Share it