Plane crash: విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం చెందారు.

Plane crash: విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం
X

న్యూస్ లైన్ డెస్క్: విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా సహా 10 మంది దుర్మరణం చెందారు. ఆఫ్రికా దేశమైన మలావీలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా మీడియాకు వెల్లడించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన విమానం 350 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణం లేకపోవడంతో అక్కడ దిగవద్దని ఏటీసీ అధికారులు సూచించారు. కాగా, ఈ క్రమంలోనే రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఈ ప్రమాదంలో వైస్ ప్రెసిడెంట్‌తో సహా 9 మంది మరణించారు.

Tags:
Next Story
Share it