Jagadish reddy: గత కాంగ్రెస్ పాలన పునరావృతం.!

కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోరారు

Jagadish reddy: గత కాంగ్రెస్ పాలన పునరావృతం.!
X

న్యూస్ లైన్ డెస్క్: నాగార్జున సాగర్, నందికొండలో తాగునీటి ట్యాంక్‌లో పడి 30 కోతులు చనిపోయిన విషయం తెలిసిందే. గురువారం బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నాగార్జున సాగర్‌‌ను మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీయే అని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే అధికారులు ట్యాంకర్‌ నీళ్లు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it