Jagan: ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఫలితాలను చూసి దేశం ఆశ్చర్యపోతుందని తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా 151 స్థానాల్లో గెలుస్తామని ఎవరూ ఊహించలేదని గుర్తుచేశారు.

Jagan: ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ(AP) సీఎం వైఎస్.జగన్(YS.Jagan) గురువారం విజయవాడలోని ఐప్యాక్(I-PAC) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా I-PAC టీంతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ఫలితాల(results)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైసీపీ(YCP) అధికారంలోకి రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఫలితాల్లో భారీ విజయం సాధించనున్నామని తెలిపారు. ఫలితాలను చూసి దేశం ఆశ్చర్యపోతుందని తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా 151 స్థానాల్లో గెలుస్తామని ఎవరూ ఊహించలేదని గుర్తుచేశారు. ఈసారి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని జగన్ వెల్లడించారు. ఎంపీ సీట్లు(MP Seats) కూడా గతం కన్నా ఎక్కువ వస్తయని పేర్కొన్నారు. ఏడాదిన్నరగా I-PAC టీం చేసిన కృషి ఎంతో గొప్పదని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీ ఫలితాలు విడుదలయ్యాక దేశంలోని ప్రతి నేత వైసీపీవైపే చూస్తారని జగన్ అన్నారు.

Tags:
Next Story
Share it