Job: రాయలసీమకు చెందిన వ్యక్తికి తెలంగాణలో ఉద్యోగం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మూల కారణాలు నీళ్లు, నిధులు నియామకాలు. ఈ నినాదమే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరటానికీ, రాష్ట్ర సాధనకూ దోహదం చేసింది.

Job: రాయలసీమకు చెందిన వ్యక్తికి తెలంగాణలో ఉద్యోగం
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మూల కారణాలు నీళ్లు, నిధులు నియామకాలు. ఈ నినాదమే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరటానికీ, రాష్ట్ర సాధనకూ దోహదం చేసింది. మన ఉద్యోగాలు మనకే రావాలని, మన పిల్లలు బాగుపడాలని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలిపిస్తుంది. రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఏళ్ళ నుంచి కష్టపడి చదువుతూ.. ప్రభుత్వ ఉద్యోగ నోటోఫికేషన్ ల కోసం ఎదురుచూస్తున్నారు. కోచింగ్ సెంటర్ లలో చేరి చాలా డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు.

అయితే తాజాగా రాయలసీమకు చెందిన వ్యక్తికి తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగం కలిపించారు. కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా గ్రూప్ 4 స్థాయి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం ఇచ్చారు. ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు. తాము చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం కష్టపడి చదువుతున్నామని. . ఇలా నాన్ లోకల్ వారికి ఉద్యోగం ఇయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కాగా, స్థానిక సంస్థల్లో ఉద్యోగులైవరైనా మృతి చెందిన లేక ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న సదరు ఉద్యోగి కుటుంబీకుల్లో కారుణ్య నియామకాల ప్రక్రియ ద్వారా ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తోంది. ఈ విధానం కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. అయితే ఉద్యోగుల వారసులకు అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు ఇస్తారు.

Next Story
Share it