Justice Ghosh: కాళేశ్వరం పై అఫిడవిట్‌ సమర్పించాలి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అఫిడవిట్‌ సమర్పించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇంజినీర్లకు ఆదేశించారు.

Justice Ghosh: కాళేశ్వరం పై అఫిడవిట్‌ సమర్పించాలి
X

న్యూస్ లైన్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అఫిడవిట్‌ సమర్పించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇంజినీర్లకు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారిస్తున్నామని, అఫిడవిట్‌ ద్వారా అన్ని విషయాలు తెలపాలని వారిని ఆదేశించినట్లు జస్టిస్‌ పీసీ ఘోష్ సోమవారం మీడియాకు తెలిపారు. ‘‘జూన్‌ 25లోపు నివేదిక సమర్పించాలని ఇంజినీర్లందరికీ చెప్పామని, అఫిడవిట్‌ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయి అన్నారు. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోందని అన్నారు. లోపం ఎక్కడుంది? ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తాం’’ అని జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు.

Tags:
Next Story
Share it