KCR: కోమటిరెడ్డికి చెప్పుతో కొట్టినట్టుగా కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం కంటే మంచిగా చేయాలన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కానీ ఇప్పటి దాంక ఒక్కటి కూడా చేయలేదన్నారు.

KCR: కోమటిరెడ్డికి చెప్పుతో కొట్టినట్టుగా కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
X

న్యూస్ లైన్ డెస్క్: కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వం కంటే మంచిగా చేయాలన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కానీ ఇప్పటి దాంక ఒక్కటి కూడా చేయలేదన్నారు. నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ‘‘పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టాలి. బద్నాం పెట్టాలి. అలా చేస్తే మీరు పెద్దోళ్లు అవుతారా..? అధికారం శాశ్వతం కాదు.. మన హక్కులు శాశ్వతం. కేసీఆర్ ప్రభుత్వం పోగానే కట్‌కా వేసినట్లే పోతదా? ఎక్కడికి పోయింది? దద్దమ్మలా రాజ్యం.. చేతకాని చవటల రాజ్యం ఉంటే అట్లనే ఉంటది. ఏమైందిరా బిడ్డ కరెంటు అని నిలదీయాలి? మొన్నటిదాక నడిచిన కరెంటు కాకుండా .. ఏం రోగం పుట్టిందని కరెంటు ఇస్తలేరు? నల్లగొండ సభతో ఆగం... ప్రజలను కరెంటు, నీళ్లకు తిప్పలు పెడితే ఎక్కడిక్కడ నిలదీస్తాం, వదిలిపెట్టం. ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు ఇచ్చిందో అట్లనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా అసెంబ్లీలోనే జనరేటర్ పెట్టారు. చేతకాక... మంది మీద బద్నాం చేసి బతుకుతున్నారు. రైతుబంధు ఇచ్చేందుకు కూడా చేతకాదా.? ఇంత దద్దమ్మలా..? రైతుబంధు అడిగేటోళ్లను చెప్పుతో కట్టాలి అంటారా..? ఎన్ని గుండెలు రా మీకు.. కండకావరమా..? కళ్లు నెత్తికొచ్చాయా? నోటి దురుసుతో మాట్లాడితే ... పంటలు పండించే రైతుల దగ్గర కూడా చెప్పులు ఉంటాయి. రైతుల చెప్పులు బందబస్త్‌గా ఉంటాయ్, గట్టిగా ఉంటాయి. ఒక చెప్పు దెబ్బతో మూడు పళ్లు రాలుతాయ్’’ అన్నారు.

Tags:
Next Story
Share it