KCR: పులిలా కొట్లాడతా.. పిల్లిలా ఉండను!

కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగారు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. కరెంట్ కోతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

KCR: పులిలా కొట్లాడతా.. పిల్లిలా ఉండను!
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగారు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. కరెంట్ కోతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఆయన కృష్ణాజలాలలపై మాట్లాడుతూ ‘‘అది మొగోడు చేయాల్సిన పని. పాలిచ్చే బర్రెను అమ్మి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. కృష్ణ జలాలను కేంద్రానికి అప్పగించే.. ఉమ్మడి రాష్ట్రమే నయంగుండేనన్నాడు. మరి శ్రీకాంతా చారి ఎందుకు చచ్చిపోయిండు. ఉద్యమకారులు ఎందుకు చచ్చిపోయిర్రు.? లక్షల కోట్ల మంది ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారు. నీళ్ల మంత్రిగా పని చేసిండు కాబట్టి, నష్టం తెలుసుకాబట్టి హరీశ్ రావు నీళ్ల నిజాలు బయటపెట్టిండు. వెంటనే నాలుగైదు రోజులు నాటకాలు ఆడిర్రు. నిలబెట్టి గట్టిగా అడిగితే.. చరిత్రలో తొలిసారి అతిముఖ్యమైన బడ్జెట్ పక్కన పెట్టి.. తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజల ముందు తేల్చుకుందామని.. నాకు చేతనైనా, కాకపోయినా నా కట్టె కాలేవరకు తెలంగాణకు చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా తప్ప.. పిల్లిలా ఉండను’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:
Next Story
Share it