జైల్లో కేజ్రీవాల్ ఎంత బరువు తగ్గారో తెలుసా..?

తీహార్ జైలుకు వెళ్లిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గారు.

జైల్లో కేజ్రీవాల్ ఎంత బరువు తగ్గారో తెలుసా..?
X

న్యూస్ లైన్ డెస్క్: జైలుకు వెళ్లిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీ పూర్తయిన తర్వాత అక్కడి రౌస్ రెవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 15 రోజుల పాటు కేజ్రీవాల్ జైల్లోనే ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేతలు కేజ్రీవాల్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎన్నో ఏళ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం రాత్రి పగలు పని చేశారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ ఏకంగా నాలుగున్నర కిలోల బరువు తగ్గారని వెల్లడించారు. మోడీ ప్రభుత్వం అక్రమ కేసులతో జైల్లో పెట్టి సీఎం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెడుతోందని ఆరోపించారు.

మరోవైపు జైలు అధికారులు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. కస్టడీలోకి తీసుకున్నప్పటి నుండి.. ఇప్పటి వరకు కేజ్రీవాల్ బరువు తగ్గలేదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌కు ఇంటి భోజనమే అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వెల్లడించారు.

Tags:
Next Story
Share it