Politics: ఖర్గేకి కనీస ఆలోచన లేదు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

Politics: ఖర్గేకి కనీస ఆలోచన లేదు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

న్యూస్ లైన్ డెస్క్: జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)కి కనీస ఆలోచన లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(konda vishweshwar reddy) అన్నారు. ఈరోజు జేబీపీ రాష్ట్ర కార్యాలయం(BJP Office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం(Press meet)లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌(Congress)పై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ భాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అనేవి అసాధ్యమైన హామీలు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం(state government) వద్ద అసలు ఖజానా లేదని.. చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీ చేయాలంటే రూ.32 వేల కోట్లు కావాలని, అది సాధ్యమయ్యే పనేనా..? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఐదు కేజీలు కాదు పది కేజీలు బియ్యం ఇస్తామని ఖర్గే చెబుతున్నారని.. ఆయన కనీస ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:
Next Story
Share it