King Charles: క్యాన్సర్‌తో హాస్పిటల్‌లో చేరిన బ్రిటన్ రాజు

ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మరోసారి లండన్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.

King Charles: క్యాన్సర్‌తో హాస్పిటల్‌లో చేరిన బ్రిటన్ రాజు
X

న్యూస్ లైన్ డెస్క్: బ్రిటన్ రాజు చార్లెస్-3(Charles III) మరోసారి హాస్పిటల్‌లో చేరారు. గత కొంత కాలంగా క్యాన్సర్(cancer)తో బాధ పడుతున్న ఆయన ఇటీవల చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ప్రోస్టేట్ క్యాన్సర్‌ బారిన పడిన ఆయన ఫిబ్రవరిలో చికిత్స తీసుకున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మరోసారి లండన్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. డాక్టర్లు ఆయనను పరీక్షించి చార్లెస్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని చెప్పినట్లు వెల్లడించింది. తాజాగా, చార్లెస్ పరిస్థితిపై ఆయన సతీమణి క్వీన్ కెమిల్లా కూడా స్పందించారు. చార్లెస్ కు క్యాన్సర్ రావడం చాలా బాధకారమంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అయినప్పటికీ వీలైనంత త్వరగా విధుల్లో చేరాలని చార్లెస్ ప్రయత్నిస్తున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.

Tags:
Next Story
Share it