3rd Test: మూడో టెస్టుకు.. కేఎల్ రాహుల్ దూరం!

కేఎల్ స్థానంలో కర్ణాటర బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను జట్టుకు ఎంపిక చేసింది.

3rd Test: మూడో టెస్టుకు.. కేఎల్ రాహుల్ దూరం!
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో టెస్టు మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. తొలి టెస్టులో గాయపడిన రాహుల్ ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రాహుల్‌ను మూడో టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కేఎల్ స్థానంలో కర్ణాటర బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను జట్టుకు ఎంపిక చేసింది. మొదటి టెస్టు ఆడిన రాహుల్.. గాయం కారణంగా రెండో టెస్ట్ ఆడలేదు.

కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఆతడు 90 శాతం మ్యాచ్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. బీసీసీఐ వైద్యుల బృందం పర్యవేక్షణలో పురోగతి సాధిస్తున్నాడు అని ప్రకటనలో పేర్కొంది. ఇక చివరి మూడు టెస్టు కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. కాగా ఈ జట్టులో రాహుల్, రవీంద్ర జడేజాలకు సెలక్షన్ కమిటి చోటు కల్పించింది. అయితే బీసీసీఐ వైద్య బృందం నుంచి అనుమతి వస్తేనే.. వాళ్లు తుది జట్టులో ఉంటారని సప్షం చేసింది. రాహుల్ స్థానంలో దేవదత్‌ను ఎంపిక చేసింది. పడిక్కల్ ఫస్ క్లాస్ క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీతో పాటు భారత్ ఎ తరపున కూడా మంచి ఆడుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ టీమ్ ఫిబ్రవరి 15న జరగబోయే మూడో టెస్టు కోసం అబుదాబి నుంచి సోమవారం రాజ్‌కోట్ కు చేరుకుంది. మగళవారం ఎస్‌సీఏ గ్రౌండ్‌లో సాధన చేసింది. మరోవైపు భారత్ జట్టు కూడా మైదనంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఇరు జట్లు 1-1తో సమంగా ఉంది.

Tags:
Next Story
Share it